భోగి పండుగ

మనం ఇంతకు ముందు బ్లాగ్ లో పండుగ అంటే ఏమిటో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మన తెలుగు వారు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి అయిన భోగి పండుగ గురించి తెలుసుకుందాం. భోగి పండుగ యొక్క ప్రాముఖ్యత మన హిందువుల పండుగలలో మకర సంక్రాంతి అత్యంత ముఖ్యమైనది. అయితే ఈ సంక్రాంతి పండుగకి ముందు వచ్చే పండుగనే ‘భోగి’ పండుగ అంటారు. భోగి పండుగ అనగానే మనకు గుర్తు వచ్చేది ఉదయాన్నే లేచి భోగి మంటలు వేయడం, … Read more

శ్రీరామావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం

భగవంతుడు, తన భక్తులను కాపాడటానికి, ఆధ్యాత్మిక ధర్మాన్ని స్థాపించేందుకు భూమిపై పలు అవతారాలు దాల్చిన విషయం మనకు తెలిసిందే. దశావతారాల శ్రేణిలో ప్రతి అవతారం ఒక విశేషమైన సందేశంతో, విలక్షణమైన లక్షణాలతో దివ్యమైన కథను మోసుకొస్తుంది. ఆదిభగవంతుని రామావతార కథ మన గత బ్లాగులో, పరశురామావతార కథను వివరించాము. పరశురాముడు క్షత్రియుల హింసాత్మక ఆచారాలను నరికివేయటానికి, భూలోకంలో ధర్మాన్ని స్థాపించటానికి అవతరించాడు. ఇప్పుడు, అదే పరమాత్మ తన తదుపరి అవతారమైన రామావతారంలో, మరింత విశేషమైన దైవిక కథతో … Read more

పరశురామావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారం

పరమ శక్తి కలిగిన శ్రీహరి భూలోకంలో ఎందుకు అవతరించాడు? దుర్మార్గుల అహంకారాన్ని అణగదొక్కేందుకు శ్రీహరి ఎందుకు మానవ రూపాలనే ధరించవలసి వచ్చింది? ముందు కథలో వామనావతారం కథలో శ్రీహరి బలిచక్రవర్తి యొక్క గర్వాన్ని ఎలా అనగదొక్కాడో తెలుసుకున్నాం కదా! ఇప్పుడు, మరొక కొత్త అవతారం కోసం తెలుసుకుందాం. అదే పరశురామావతారం. అసలు ఈ పరశురాముడు ఎవరు? అతనికి క్షత్రియులంటే ఎందుకు అంత కోపం? పరశురాముడు ప్రపంచం మొతాన్ని ఇరవై ఒక్క(21) సార్లు ఎందుకు తిరగవలసి వచ్చింది? అసలు … Read more

వామనావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క ఐదవ అవతారం

గత కథలో మనం శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరించి, ధర్మాన్ని నిలబెట్టిన విషయం గురించి తెలుసుకున్నాం కదా! అలానే ఆ శ్రీ మహావిష్ణువు మరలా ఇంకొక అవతారమైన వామనావతారం  గాధను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ వామనావతారమేమిటి? శ్రీహరి ఒక చిన్న బాలుని రూపం ఎందుకు దరించవలసి వచ్చింది? బలిచక్రవర్తి ఎవరు? బలిచక్రవర్తిని వామనుడు పాతాళానికి ఎలా తొక్కడు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలీ అనుకుంటున్నారా? అయితే ఈ వామనావతార గాధను చదివి మరిన్ని … Read more

నరసింహావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క నాల్గవ అవతారం

మీకు తెలుసా? భగవంతుడు తన భక్తులను, సృష్టిని రక్షించేందుకు అనేక రూపాలను ఎత్తాడని? ఒక్కో అవతారం వెనుక ఒక్కో గొప్ప కారణం ఉంటుంది. అందులోని ఒక అవతారం హిరణ్యకశిపుని సంహరించి భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఎత్తడం. ఇంతకు ముందు మనం వరాహావతారం గురించి తెలుసుకున్నాం కదా. ఆ కథలో, భూమి మహాసముద్రంలో మునిగి పోయినప్పుడు, భూమతను రక్షించేందుకు శ్రీ హరి పంది రూపమైన వరాహ రూపంలో అవతరించాడు. ఆ మహా కథ మిమ్మల్ని … Read more

వరాహావతారం: శ్రీ మహావిష్ణువు యొక్క మూడవ అవతారం

భగవంతుడు శ్రీ మహావిష్ణువు తన దశావతారాలలో మూడవ అవతారంగా వరాహ(పంది) అవతారాన్ని స్వీకరించి భూమాతను రక్షించిన గొప్ప కథ ఇది. విశ్వ రక్షణ కర్త అయిన శ్రీ మహావిష్ణువు భూమి ప్రాణికోటి మరియు సమస్త జీవరాశిని కాపాడిన మహిమను ఈ వరాహావతారం ద్వారా మనం వివరంగా తెలుసుకోవచ్చు. ఇంతకు ముందు మనం శ్రీ మహావిష్ణువు రెండవ అవతారమైన కూర్మావతారం గురించి చూశాం. క్షీరసాగర మధనంలో దేవతల రక్షణ కోసం ఆయన ఎలా కూర్మ రూపాన్ని ధరించి మంధర … Read more

క్షీరసాగర మధనం: శ్రీ కూర్మావతారం యొక్క మహిమ(శ్రీ మహావిష్ణువు రెండవ అవతారం)

మనమందరం ఇంతకుముందే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో ధర్మరక్షణకోశం సముద్రగర్భం నుండి వేదాలను ఎలా రక్షించాడో తెలుసుకున్నాం కదా! ఆ అవతారం ధర్మానికి శక్తివంతమైన బలాన్ని ఇచ్చింది. కానీ ఆ తరువాత దేవతలకు రాక్షసులకు మధ్య మరొక మహా సంఘటన జరిగింది. అదే క్షీరసాగర మధనం(పాల సముద్రాన్ని చిలుకుట). ఈ మహాసముద్ర మధనానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎందుకు ఎత్త వలసి వచ్చిందో మీకు తెలుసా? ఆ సముద్ర మధనంలో హాలాహలం అనే భయంకర విషయం ఎందుకు పుట్టుకు … Read more

మత్స్యావతారం: శ్రీమహావిష్ణువు మొదటి అవతార గాథ

శ్రీ మహావిష్ణువు దశావతారాల గాధ మనకందరికీ తెలిసినదే కదా! ఈ భూమిపై ధర్మం నశించిన ప్రతిసారీ ఆ శ్రీహరి తన దశావతారాలలో ఏదో ఒక అవతారం ఎత్తి ధర్మాన్ని నిలబెడుతున్నాడు. ఆ దశావతారాలలోని మొదటి అవతరమే మత్స్యావతారం (చేప).  అసలు ఈ మత్స్యావతారం ఏమిటి? శ్రీ మహావిష్ణువు చేపగా ఎందుకు మారారు? ఈ అవతారం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ క్రిందనున్న కథను చదవండి. హయగ్రీవుడు ఎవరు? పూర్వం హయగ్రీవుడు అనే … Read more

శ్రీ మహావిష్ణువు అవతార గాధ

వైకుంఠ ద్వారం వద్ద జయ-విజయుల విధులు వైకుంఠమున క్షీర సముద్రమునందు ఆదిశేషునిపై శయనించి ఉన్న శ్రీ మహావిష్ణువును దర్శించుటకు మహర్షులు ముని పుంగవులు వస్తున్న సమయమది. వైకుంఠమునకు పోవు ద్వారము వద్ద ద్వార పాలకులుగా జయ విజయులు ఉన్నారు. నిరంతరము ఆ జయ విజయులు కుడి ఎడమల నిలబడి, స్వామి సేవకు, మరియు మేలుకొలుపులకు ప్రధమ దర్శనం వారి తరువాతనే మిగతావారికిను . లక్ష్మీసమేతుడైన శ్రీమహావిష్ణువుకు ఏకాంతములో భంగం కలిగించకుండా చూడడమే వారి ప్రథమ కర్తవ్యం. జయ … Read more